ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాగుత్తి పట్టణం నందు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసిగిరి మణికంఠ తెలుగుదేశం పార్టీ గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ ప్రాయశ్చిత్త దీక్ష హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు హిందూ భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి పాటిల్ సురేష్ చిన్న వెంకటేశులు బ్రహ్మయ్య కే కవిత డాక్యుమెంట్ రైటర్ సత్య హేమావతి అఖండూ భాష గద్దల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు