contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వి. సుధాకర్ , కేసీఆర్, జగన్, చంద్రబాబు

ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ శుభాకాంక్షలు తెలిపారు.

జర్నలిస్టుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలను వి.సుధాకర్ తెలియజేశారు. దేశానికి మరెన్నో సంవత్సరాల పాటు సేవ చేయాలని… మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలను కేసీఆర్ తెలియజేశారు.

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు, దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షును భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. మోదీని కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :