కాకినాడ : బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయం శనివారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో ఘనంగా ప్రారంభించారు. బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం (సుబ్బు భాయ్) అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేని, న్యూరో సర్జన్ డాక్టర్ కె.బాబ్జీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.భానుమతి, సామర్లకోట మండలం ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మణరావు ముఖ్య అతిధులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో వున్న ఏడు నియోజకవర్గాల బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గుమ్మపు చిత్రసేని మాట్లాడుతూ కాకినాడ జిల్లా కార్యాలయం ప్రారంభించడం శుభ తరుణమన్నారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలోని కార్యాలయాలు ఏర్పాటు చేసి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యాలయం అంబేద్కర్ సిద్ధాంతాలకు కేంద్ర స్థానంగా తయారు కావాలని, ఈ కార్యాలయం నుంచే అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రతీ నియోజకవర్గం, మండలాలకు విస్తరింపజేయలని ఆయన కోరారు. అంబేద్కర్ కోరినట్టు బహుజనుల రాజ్యాధికారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత ముఖ్య అతిథులు, జిల్లా నాయకులు డా. బిఆర్.అంబేద్కర్, కాన్షీరాం, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, పెరియాల రామస్వామి, నారాయణ గురు, సాగు మహారాజ్ తదితరులు చిత్ర పాటలతో కార్యాలయం లోపలికి అడుగు పెట్టారు. అనంతరం చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ఇన్చార్జులు సబ్బరపు అప్పారావు, తంతటి కిరణ్ కుమార్, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు, జిల్లా ట్రెజరర్ సాధనాల రాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యం మాస్టర్, బీవీఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి బుల్లిరాజు, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివ, మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షుడు నీలం నాగేంద్ర ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు రొట్ట శ్రీనివాసరావు, బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా బీసీ సంఘం నాయకుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర, డిబిఎఫ్ జిల్లా కన్వీనర్ తోటి చంగలరావు, ప్రతిపాడు నియోజకవర్గం ఇన్చార్జి గుణపర్తి అపురుప్, సవిలే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
