తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పి.హెచ్.సి పరిధిలోని మద్దినాయనిపల్లి సచివాలయం వద్ద సిమ్స్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు స్థానిక సర్పంచ్ గిరిధర్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. పింక్ బస్సులో మహిళలు,పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు,పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో దామలచెరువు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవిరామ్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత, సర్పంచ్ కె.గిరిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి, ఎంల్ హెచ్ పి జి.మీనా, ఏఎన్ఎం లావణ్య, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
