తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్యగారిపల్లి పంచాయతీ రవణఖ్ నగర్ లో పశు సంవర్ధక శాఖ ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నేత షాజహాన్ భాష విచ్చేశారు. గ్రామంలో ఉన్నటువంటి పశువులకు పిడుదుల మందు పిచికారి చేసి, మేకలకు, దూడలకు, పశువులకు నట్టల నివారణ మందు తాగించడం జరిగింది. గర్భకోశ వ్యాధులకు చికిత్స చేశారు. టిడిపి నేత షాజహాన్ భాష చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో పశువులకు సంబంధించిన ప్రభుత్వం తరఫున ఉచిత మందులు పంపిణీ చేశారు. పశువులకు స్ప్రే మందు చేశారు. ఉచిత పశు వైద్య శిబిరాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వై.బి పవన్ కుమార్, వి.ఎ.ఎస్ హేమంత్ కుమార్, వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.
