తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జాతీయ ఎలక్ట్రిషన్ డే వేడుకను మండల ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అధ్యక్షుడు సభాస్టీన్, ఉపాధ్యక్షుడు ముని కృష్ణారెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రిషన్ బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిషన్, విద్యుత్ ను కనుగొన్న మైఖేల్ ఫారడే అని ఈ సందర్భంగా ఈరోజు జాతీయ ఎలక్ట్రిషన్ డే జరుపుకుంటారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు సీనియర్ ఎలక్ట్రీషన్లు మాట్లాడుతూ జాతీయ ఎలక్ట్రిషన్ డే సందర్భంగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుండి చిత్తూరు రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. విద్యుత్తు మన జీవితాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది మన ఇళ్లను వెలుగులో ఉంచడానికి, ఎలక్ట్రానిక్ పరికరాలను నడపడానికి, అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుందని అన్నారు. విద్యుత్ వినియోగంలో ఏమైనా అంతరాయం కలిగినా, విద్యుత్ ఉపకరణాలు రిపేర్ కు వచ్చిన వాటిని మనం రిపేర్ చేస్తుంటామని అన్నారు. నేటి ఈ సమాజంలో ఎలక్ట్రిషన్ ఎంతో అవసరం అని తెలిపారు. ఎలక్ట్రిషన్,విద్యుత్ సిబ్బందికి పనిముట్లు ఇచ్చి,ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, గంగాధరం, బాలాజీ, భాస్కర్, లోకనాథసింగ్, సబీర్ బాయ్, సభ్యులు పాల్గొన్నారు.
