తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ క్రైమ్, సోషల్ మీడియా క్రైమ్, ఆన్ లైన్ గేమ్ మోసాలు వంటి నేరాల గురించి అవగాహన కార్యక్రమం పాకాల సి.ఐ మద్దయ్యాచారి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహిద్దిన్ భాష అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాకాల సి.ఐ మద్దయ్యాచారి మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, బాల కార్మికులు, పిల్లల దుర్వినియోగం, సోషల్ మీడియా క్రైమ్, బాల్య వివాహాలు, ఆన్ లైన్ గేమ్ మోసాలు వంటి నేరాల గురించి వాటి పర్యవసానాలు వాటి నివారణ మార్గాలు, ట్రాఫిక్ నియమ నిబంధనలు, వ్యక్తిత్వ వికాసం గురించి కళాశాల, పాఠశాల విద్యార్థులకు అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.విద్యార్థి దశ నుండే క్రమశిక్షణతో తమ లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు.పిల్లల ప్రవర్తన వలన తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకే కాకుండా సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల మాటలకు ప్రలోభ పడి వ్యక్తిగత సమాచారం,ఆధార్ కార్డు,పాన్ కార్డు వంటి వివరాలు ఎట్టి పరిస్థితులలో అపరిచిత వ్యక్తులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు.ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని వారి మాటలకు విలువనిచ్చి నడుచుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు.విద్యార్థులు ఎవరైనా ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ వంటి వాటికి పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు