గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మూల హరీష్ గౌడ్‌ను జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. పార్టీ అధినాయకత్వం ఆయనకు రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడంతో రచ్చపల్లి గ్రామంతో పాటు ధర్మారం మండల జనసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మూల హరీష్ గౌడ్ గతంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జిగా, తెలంగాణ రాష్ట్ర యువత కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. 2019లో ధర్మారం మండలం జెడ్పీటీసీగా పోటీ చేసి ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్న హరీష్ గౌడ్‌కు రాష్ట్రస్థాయిలో బాధ్యతలు అప్పగించడం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధిగా హరీష్ గౌడ్ పార్టీ విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం లభించిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం సముచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
మూల హరీష్ గౌడ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.








