కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ కేంద్రంలో హమాలీలు రెండవ రోజు సివిల్ సప్లై రైస్ గోదాం ముందు నిరవధిక సమ్మె నిర్వహించారు. హమాలీల కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో హమాలీలకు పెంచిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరవించబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మారుతి, బాపూరావు, గణేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.