కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతి శాఖ వారి సౌజన్యంతో మోక్షిత డాన్స్ అకాడమీ, సేవాసమితి ఆధ్వర్యములో జాతీయస్థాయి అవార్డుల మహోత్సవ పురస్కారాలు జరిగాయి ఈయొక్క సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిర్పూర్ నియోజకవర్గం శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు , ఎస్పి ఎం గిరీష్ బాబు ,పాముఖ వైద్యులు డాక్టర్ విద్యాసాగర్ , పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అహొనతమైన ధూమ్ ధాం ఆట, పాట కళాకారులు నృత్య కళాకారులకు ఉన్నతమైన పురస్కారాలు అందించడం జరిగింది. కళాకారులు నృత్యాలను ప్రదర్శించి ప్రజలను ఆలరించారు .ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ నృత్య కళాకారులు మరియు ప్రోగ్రాం ఆర్గనైజర్ డొంగ్రీ సంతోష్ ను అభినందిచారు.