కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలంలోని శ్రీ తాపాల లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయం మహాత్మా నగర్ లో గత నెల 16 వ తేది నుండి ప్రారంభమైన ధనుర్మాస వ్రత మహోత్స వాలలో భాగంగా ఆదివారం 28 వ రోజున ప్రభాత సమయo లో తిరుప్పావై పాశురాల ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 11:30 నుండి మంచి ముత్యాల తలంబ్రాల తో శ్రీ గోధారంగనాథుల తిరు కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ తాపాల లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ తిరునగరి వెంకటాద్రి స్వామి వారి ఆధ్వర్యంలో అర్చకులు వెంకట రమణ, హర్ష వర్ధన్, సాయి అభిలాష్ లచె నిర్వహించారు. ఈ కార్య క్రమంలో మొదట విష్వక్సేన ఆరాధన,స్వస్తి పుణ్యహావాచనం,రక్షాబంధనం, ఋత్విగ్వరణం, కన్యాదానం,మాంగల్య ధారణ మంచి ముత్యాల తలంబ్రాల కార్యక్రమం నిత్య సుదర్శన నరసింహ మూల మంత్ర హోమము, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి తదనంతరం సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,ఈ కళ్యాణ మహోత్సవం లో 48 జంటలు కన్యాదాత లుగా పాల్గొన్నారు, ఈ సందర్భముగా దేవాలయ కమిటీ వారు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు,దేవాలయ అధ్యక్షులు ఇనుకొండ్ నాగేశ్వర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి ఎల్లారెడ్డి, కోశాది కారి పెండ్యాల కొండలరెడ్డి,మాజి సర్పంచ్ శ్రీమతి జక్కని స్వరూప రవీందర్,మాజి జడ్పీటీసీ ఉల్లెంగల పద్మ ఏకానందం మాజి వైస్ ఎం పిపి పొన్నాల భూలక్ష్మీ సంపత్, మాజి ఉపసర్పచ్ మడుపు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు మదుపు అనంతరెడ్డి గుంటుకు కనకయ్య,,సింగిరెడ్డి ఎల్లారెడ్డి,గూడ కమలాకర్, ఎర్రం సాగర్,తక్కిటి లింగారెడ్డి, పెండ్యాల సదాశివ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, ఎంద్ర బాలరాజు, నూనె మధు,పాశం మురళీ కనకరాజు,మయూరి శ్రీనివాస్ కరీంనగర్ తిమ్మాపూర్,మండలములకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
