కరీంనగర్ జిల్లా: ఈనెల 22న తేదీన రాత్రి ఖాసీంపేట గ్రామ శివారున గుర్తు తెలియని వాహనం గన్నేరువరం గ్రామస్తుడిని యాక్సిడెంట్ చేసి వెళ్లిన సంబంధిత వాహన సీసీ ఫుటేజ్ లను పోలీసులు మంగళవారం విడుదల చేశారు. అదీ బజాజ్ మోటర్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా కనబడుతోంది. ఆక్సిడెంట్ జరిగిన స్థలంలో రోలేక్స్ అనే ఇంగ్లీష్ అక్షరాల్తో ఉన్నా బ్లాక్ కలర్ టోపీ, బ్లాక్ కలర్ అద్దాలు, బోల్ట్ ఈయర్ బర్డ్, పల్సర్ ఇండికేటర్ లైట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కావున ఈ ఆధారాలు, పైన చూపిన సీసీ ఫుటేజ్ ఫోటోల ద్వారా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తుంచి పోలీస్ కి సహకరించగలరనీ కోరారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం ఇవ్వడంతోపాటు అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్:
SIP గన్నేరువరం: 8712670771
PC సతీష్ 7702995881
PC పరుశరామ్ 9849848179