గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం ఉప సర్పంచ్ రామంచ స్వామి ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కరీంనగర్ పట్టణంలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఆకుబత్తిని విజయకుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని గన్నేరువరం ఉప సర్పంచ్ రామంచ స్వామికి అందజేశారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆకుబత్తిని విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి రామంచ స్వామి మాట్లాడుతూ.. ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఉపసర్పంచ్‌కు న్యాయం జరిగేలా ఫోరం తరఫున నిరంతరం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ గౌడ్, కార్యదర్శి రాజిరెడ్డి, అధికార ప్రతినిధి దుస్స కుమార్ పాల్గొన్నారు.








