గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు గురువారం మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మండల వ్యాప్తంగా అర్హులను గుర్తించి వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకపక్క కట్టిన ఇళ్లు కూలిపోతున్నాయని ,కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ వాడి లక్షలాది ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికార పార్టీ నేతలు తమకు కావాల్సిన వారికి ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ రఫీకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, సహాయ కార్యదర్శులు కూన మల్లయ్య, పిప్పల కనుకయ్య, గుండ్లపల్లి గ్రామ కార్యదర్శి బోయిని తిరుపతి, గన్నేరువరం గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య, మాదాపూర్ గ్రామ కార్యదర్శి గాజుల లక్ష్మణ్, కొండాపూర్ కార్యదర్శి ఆంజనేయులు, మండల నాయకులు ఎండి, యువజన నాయకులు మోలుగురి ఆంజనేయులు, నయ్యుం, బిట్ల శ్రీనివాస్, సంపత్, శంకర్, చామనపల్లి శంకర్, సంపత్ కొమురయ్య, జలపతి, సంబు తిరుపతి, పంబాల ఆంజనేయులు,బుట్ల భాస్కర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాదాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీలో చేరారు.








