గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: వేసవి ముగిసి వర్షాలు మొదలవగానే గన్నేరువరం మండలంలో ఈత చెట్ల కోతకు గౌడన్నలు శ్రీకారం చుట్టారు. మండల వ్యాప్తంగా ఉన్న వందలాది ఈత వనాల్లో గురువారం నుండి కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
దసరా వరకు ఫుల్ సీజన్:
రానున్న దసరా పండుగ వరకు ఈ సీజన్ కొనసాగనుంది. ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నీరా ఉదయం, సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే సాయంత్రం తర్వాత సహజసిద్ధమైన ఈత కల్లు కూడా లభించనుంది.
గౌడన్నల కష్టం:
తెల్లవారుజామున 4 గంటలకే లేచి, ప్రాణాలకు తెగించి చెట్లు ఎక్కి కల్లు గీత కార్మికులు నీరా సేకరిస్తున్నారు. వారి కష్టానికి తగిన గుర్తింపు, ప్రభుత్వం నుండి సాయం అందాలని స్థానికులు కోరుతున్నారు.
నీరా తో ఆరోగ్య ప్రయోజనాలు:
నీరా తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని, జీర్ణశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కెమికల్ లేని సహజ పానీయం కావడంతో ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ప్రస్తుతం మండలంలోని గునుకుల కొండాపూర్, గన్నేరువరం,జంగపల్లి, మైలారం,ఖాసీంపేట, పారువెళ్ల తదితర గ్రామాల శివారుల్లో ఈత చెట్ల కోత జోరుగా సాగుతోంది.
గన్నేరువరంలో ఈత చెట్ల కోత ప్రారంభించిన గౌడన్న బుర్ర అంజయ్య గౌడ్
గన్నేరువరం: మండల కేంద్రానికి చెందిన ప్రముఖ గీత కార్మికుడు బుర్ర అంజయ్య గురువారం నుండి ఈత చెట్ల కోతను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ శివారులోని తన ఈత వనంలో కోత ప్రారంభించిన ఆయన, రానున్న దసరా పండుగ వరకు ప్రజలకు స్వచ్ఛమైన నీరా మరియు సహజ ఈత కల్లు అందిస్తానని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి నీరా అందుబాటులో ఉంటుందని, కల్తీ లేకుండా ప్రజలకు అందిస్తామని ఆయన అన్నారు.








