మెదక్ జిల్లా – తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ మరియు పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తూప్రాన్ డీఎస్పీ, తూప్రాన్ సీఐ హాజరై ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బక్రీద్ పండుగను పరస్పర సహకారం, సోదరభావంతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి అపోహలు, వివాదాలకు తావివ్వకుండా సామాజిక సౌహార్దాన్ని కాపాడాలని కోరారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో పాల్గొన్న మత పెద్దలు, పట్టణ ప్రముఖులు పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.








