సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు.ఈ నెలలో 2 వేల పల్లె దవాఖనాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం.సద్దితిన్న రేవు తలవాలి.నియత్ ఉంటేనే బర్కత్ ఉంటదనీ సంక్షేమ ఫలాలు పొందుతున్న లబ్ధిదారులను కోరారు.గత గజ్వేల్ పాలకులు సంజీవరావు, గీతారెడ్డి,నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి,సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి జరిగింది.కాంగ్రెస్,టీడీపీ పార్టీలో ఇవ్వని కళ్యాణ లక్ష్మీ పథకం,మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఅర్ ఇస్తుండన్నారు.
