contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రేరణ కార్యక్రమంతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న పోలీస్ అధికారులు

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి: జిల్లా ఎస్పీ తుషాన్ సిన్హా కృషితో ఈనెల ఫిబ్రవరి 6 వ తేదీన,టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ తో, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన యువతీ నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.

నిరుద్యోగులైన యువతులు ఆరో తారీకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చింతపల్లి వై.టి. సి. నందు ఈ ప్రేరణ కార్యక్రమానికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని, 18స నుండి 30స వయసు వుండాలని అన్నారు.

అర్హులైన యువతలకు బెంగళూరులో కోచింగ్ సెంటర్ నందు ఉచిత భోజనం, వసతులు కల్పించి సుమారు 20 వేల రూపాయల ఉద్యోగ భద్రత కల్పిస్తారని అన్నారు.

ఈ యొక్క ఉద్యోగ అవకాశం అల్లూరి జిల్లాలో విద్యార్థినులు సద్వినియం చేసుకోవాలని, అలాగే ఎస్టీ,యస్సిలే కాకుండా ఏ కులస్థులైనా సరే ఈ జాబ్ మేళా లో హాజరు కావచ్చని, ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు యస్పి ప్రతాప్ శివ కిషోర్,సీఐ రమేష్ ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :