contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కురుపాం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కర్రి కుమార్ నియామకం

పార్వతీపురం మన్యం జిల్ – కురుపాం : కురుపాం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా జనసేన నాయకుడు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కర్రి కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ భవన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పదవీ బాధ్యతలు అప్పగించారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా కర్రి కుమార్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వై. నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై. నూకానమ్మ, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నియామక కార్యక్రమంలో పిల్లా కన్నం నాయుడు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవల్ల తిరుపతిరావు, సాలూరు నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు పెంట తిరుపతిరావు తదితర నాయకులు, బీసీ సంఘ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కర్రి కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హక్కుల సాధన, చట్టసభల్లో బీసీలకు రావాల్సిన కోటా, రిజర్వేషన్ల సాధన కోసం అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :