హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని వర్మ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో… ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఈరోజు కూడా రెండోసారి విచారణకు డుమ్మా కొట్టడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వర్మ ఇంటికి ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు చేరుకున్నారు.