చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో ఏ టు జెడ్ ఎక్స్ట్రాటిక్ పార్క్, రెస్టారెంట్ ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట డాలర్ దివాకర్ రెడ్డి, మండల పార్టీ నాయకులు ఉన్నారు. ముందుగా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకి శాలువా కప్పి, గజమాలతో సత్కరించి, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తరువాత రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కారణంగా సుమారు 85 మంది ఉద్యోగ అవకాశాలు పొందారని అందులో ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో 35 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయని ఎంఎల్ఏ అన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ భృతి కల్పించిన యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎవరినైనా పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తానని ఆయన తెలిపారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే నేను ముందుండి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎవరైనా అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని తెలిపారు. బులుగు మీడియా తప్పుడు ప్రచారాలతో నిరాధారణ ఆరోపణలతో వార్తలను ప్రచురిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వారు అభివృద్ధి చేయకపోగా… చేస్తున్న నన్ను ఇబ్బందులు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఎవరు ఎన్ని తప్పుడు వార్తలు రాసుకున్న నియోజకవర్గ అభివృద్ధి మొదటి లక్ష్యమని తెలిపారు.