జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో 3వ తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా, నిశాంత్ అనే బాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి బాలుడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే నిశాంత్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది.
బాలుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








