కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిసిసి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో కీలక పదవులు దక్కించుకున్నారు.చొక్కారావుపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా పారువెళ్ల గ్రామానికి చెందిన అలువాల కోటి, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన గొంటి సంతోష్ జిల్లా కార్యదర్శిగా నియామకమయ్యారు. నూతనంగా ఎన్నికైన వారికి గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, మార్గం మల్లేశం, తిప్పర్తి పరిపూర్ణ చారి,దేశరజ్ అనిల్ గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వివిధ గ్రామాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.








