కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: మహారాష్ట్ర నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం సరుకును కాగజ్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 700 దేశీ దారు బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.
డాడానగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, రెడ్డి సాయి కుమార్ మరియు నీటూరి సురేష్‌గా గుర్తించారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి సుమారు 63 లీటర్ల మద్యం మరియు MH34 CG4729 నంబర్ గల వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.
ఈ ఆపరేషన్‌లో పోలీస్ సిబ్బంది దుర్గా ప్రసాద్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.








