మెదక్ జిల్లా – తూప్రాన్ మున్సిపల్ : తూప్రాన్ పట్టణ పరిధిలోని వెంకటాపూర్ పీటీ, టాటా కాఫీ సమీప ప్రాంతంలో రాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తూప్రాన్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ తో పాటు, మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తున్న హిటాచి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి గౌడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.








