కరీంనగర్ జిల్లా: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలం లోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి డిసిసి ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు రవీందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ యువ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయుష్మాన్ బ్లడ్ బ్యాంకు వారు రక్తదాతల నుండి 35 యూనిట్ల రక్తాన్ని స్వచ్ఛందంగా సేకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతూ, నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందించేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాధించాలని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పిటిసి, డీసీసీ ఉపాధ్యక్షులు గీకురు రవీందర్, డిసిసి కార్యదర్శి సాంబారిబాబు, జిల్లా నాయకులు చిట్టిమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ,దాసరి ప్రవీణ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు మార్క రాజు, సర్పంచులు గూల్ల రజిత-రాజు, కొంకట మౌనిక, అలువల శంకర్, కాటం సంపత్ రెడ్డి, కూతురు రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, బోయిని వంశీ, బెజ్జంకి అంజయ్య, జిల్లెళ్ల రమేష్, పూదరి వేణు, శిరవేణి సంపత్, పోటు మల్లా రెడ్డి, విష్ణమా ఛారి, దొబ్బల బాబు, గుజ్జుల రాజు, పిల్లి తిరుపతి, పెసరి శ్రీనివాస్, భగవాన్ ప్రసాద్, శ్రీముర్తి రమేష్, కవ్వంపెల్లి సంజీవ్, గాదెపాక సునీల్ , మండల సీనియర్ నాయకులు పూల లచ్చిరెడ్డి, దోమ శ్రీనివాస్ రెడ్డి, దోమ నరసింహ రెడ్డి, చొప్పదండి సాయి కుమార్, ముద్రవేణి కుమార్, సులుగురి సత్యనారాయణ రెడ్డి, బాలకృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు,









