మాసాయిపేట : జాతీయ రహదారిపై అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ దళం కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన మాసాయిపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన తూప్రాన్ డివిజన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు గోవులను తరలిస్తున్న లారీ మాసాయిపేట మండలం రామంతాపూర్ వద్ద ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలోని రాజస్థాన్ దాబా వద్ద ఆగింది. ముందస్తు సమాచారం అందుకున్న గోరక్షక్ దళం కార్యకర్తలు అక్కడికి చేరుకుని లారీని అడ్డగించారు.
లారీలో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన కార్యకర్తలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








