సిద్దిపేటలోని డి ఎక్స్ ఎన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి గోంటి రాజును సంవత్సరం క్రితం ఎలాంటి సరైన కారణాలు తెలియజేయకుండా ఉద్యోగం నుండి తొలగించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ తరపున గతంలో 01-04-2026న లేబర్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం సంబంధిత అధికారులకు రిమైండర్ వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, కంపెనీ కాంట్రాక్టర్‌తో పాటు ఫిర్యాదుదారునికి తదుపరి విచారణ తేదీగా 28-05-2026ను నిర్ణయించినట్లు తెలిపారు. విచారణ నిర్వహించి కార్మికునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ జి. ప్రభురాజ్, జనరల్ సెక్రటరీ బాగయ్య గారి కార్తీక్ రెడ్డి, అడ్వైజర్ సంపత్ ఎర్రవెల్లి అడ్వకేట్, బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తలారి ప్రవీణ్ కుమార్, దబ్బెట ఆనంద్ బిడీస్ ఎఫ్, ఫిర్యాదుదారు గోంటి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగుల హక్కులను పరిరక్షించే దిశగా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కార్మికుడికి న్యాయం చేయాలని కోరారు.








