గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో రెండు కీలక రహదారి పనులకు హైబ్రిడ్ అన్యూటీ మోడ్ (HAM) పథకం కింద పరిపాలన అనుమతులు లభించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హన్మజీపల్లె ఎక్స్ రోడ్–గోపాల్‌పూర్ గ్రామం వరకు, అలాగే ఖాసీంపేట గ్రామ శివారులోని కట్టే మిషన్ నుంచి పారువెళ్ల మీదుగా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామం వరకు డబుల్ రోడ్డు మంజూరైనందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారుల నిర్మాణంతో గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హన్మజీపల్లె సర్పంచ్ ఆకుల కవిత–సంతోష్, పారువెళ్ల గ్రామ సర్పంచ్ యాళ్ల లక్ష్మీ–రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, జిల్లా కార్యదర్శి గొంటి సంతోష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జెల్ల రాజేశ్వరి, సీనియర్ నాయకులు మార్గం మల్లేశం, మాజీ సర్పంచ్ సంగు దేవయ్య, మాజీ ఎంపీటీసీ బద్దం రామ్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, మాంకాల రాములు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ లింగంపల్లి శ్రీకాంత్, సంగు వేణు, వార్డు సభ్యుడు బండిపెల్లి సంతోష్, కళ్ళెం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








