గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్నేరువరం మండల కేంద్రంలో మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగానికి విశేష సేవలందించిన లూయిస్ డాగ్ రే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు స్వీట్లు పంపిణీ చేశారు. ఫోటోగ్రఫీ రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్ ఫోటోగ్రాఫర్లను అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించడంతో పాటు.. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని పలువురు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఇనుకొండ లక్ష్మణ్, కోశాధికారి వేముల రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుకొండ దత్తాద్రి, సీనియర్ ఫోటోగ్రాఫర్లు బూర తిరుపతి, మఠం ఆంజనేయులు, మటం తిరుపతి, బూర శ్రీకాంత్, కాలువ నాగరాజు, గర్శకుర్తి శశి తదితరులు పాల్గొన్నారు.








