జగిత్యాల: పోలీస్ వాహనానికి కేటాయించిన నంబర్‌తో ఓ ప్రైవేట్ కారు తిరుగుతున్నట్లు సమాచారం వెలుగులోకి రావడం జగిత్యాల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ వాహనానికి కేటాయించిన TS09 PA 3659 నంబర్‌తో ఓ ప్రైవేట్ షిఫ్ట్ కారు రోడ్డుపై తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ కారుకు వెనుక భాగంలో ‘POLICE’ బోర్డు కూడా ఉన్నట్లు సమాచారం.

ఒకవైపు పోలీస్ వాహనానికి కేటాయించిన నంబర్.. మరోవైపు అదే నంబర్‌తో ప్రైవేట్ కారు కనిపించడం పలు సందేహాలకు కారణమవుతోంది. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ రెండు వాహనాలకు ఎలా నమోదైంది? ప్రైవేట్ కారుకు పోలీస్ వాహన నంబర్ ఎలా వచ్చింది? కారుకు ‘POLICE’ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించి, వాస్తవ పరిస్థితిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకే నంబర్‌తో రెండు వాహనాలు తిరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.










