గోదావరిఖని : రామగుండం ఆర్జీ-2 నూతన జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీపతి గౌడ్‌ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఆర్జీ-2 జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆయనకు పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, లక్ష్మీపతి గౌడ్ తన విధుల్లో మరింత ప్రతిభ కనబర్చి ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం నరహరి (ఐఏఎస్) రచించిన “ఓబీసీ పోరుబాట” పుస్తకాన్ని జీఎంకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ అకునూరి బాలంకుస్, సభ్యులు మూగల మహేష్, షానీగంటి రాజలింగు, గడమల్ల రాకేష్, శంకర్, ఎస్ అండ్ పీసీ విభాగానికి చెందిన అరుకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








