contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రచారంలో దూసుకెళ్తున్న కవ్వంపెల్లి

సిద్దిపేట జిల్లా, ది రిపోర్టర్ టివి :  పల్లె పల్లెకు కవ్వంపెల్లి, గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి “పల్లె పల్లెకు కవ్వంపల్లి గడపగడపకు కాంగ్రెస్” అనే నినాదంతో బెజ్జంకి మండల గ్రామాలైనటువంటి వడ్లూరు, వీరాపూర్, తిమ్మయ్య పల్లి గ్రామాలలో సోమవారం ఇంటింటికి తిరుగుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను ప్రజలకు వివరిస్తూ, కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ విస్తృత పర్యటన చేపట్టారు, ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో వివిధ పార్టీలకు చెందినటువంటి సుమారు వందమంది కవ్వంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, పులి కృష్ణ, మంద శేఖర్,పులి రాజయ్య,పులి సంతోష్, శీలం నర్సయ్య, గుండ అమరేందర్ రెడ్డి, చిలువేరి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :