contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బిఆర్ఎస్ యువగర్జన ను విజయవంతం చేయండి

  • భారీ మెజార్టీ ఇవ్వడంలో యువతదే ముఖ్యపాత్ర వహిస్తం..
  • ప్రతి ఒక్క యువకుడు యువగర్జనలో భాగస్వామ్యం అయ్యేవిధంగా ముఖ్య నాయకులదే బాధ్యత
  • గడపగడపకు కాదు మోకాల్ల యాత్ర చేసిన ప్రజలు కాంగ్రెస్ని నమ్మరు..
  • ఎమ్మెల్యే రసమయి తోనే గన్నేరువరం మండల అభివృద్ధి

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో మండల ముఖ్య యువజన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ యువజన విభాగం నియోజక వర్గఅధ్యక్షుడు గూడూరి సురేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క యువకుడు పని చేయాలని, ప్రతి ఇంటింటికి అందజేస్తున్న సంక్షేమాన్ని ప్రతి గ్రామంలో మరింత ప్రజల్లోకి తీసుకు పోయే విధంగా, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారలను తిప్పికొట్టే విధంగా సిద్ధం కావాలని ఈ సందర్భంగా యువజన నాయకులకు సూచించారు. గత పాలకుల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని గన్నేరువరం మండలాన్ని విస్మరించారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గన్నేరువరం నూతన మండలం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని మండలానికి మండల ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎమ్మెల్యే రసమయి, జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి నేతృత్వంలో ప్రగతిలో ముందుకు పోతున్నామని. రానున్న ఐదు సంవత్సరాలు అవకాశం కల్పించాలని మండలంలోని అన్ని పనులు పూర్తిచేసి మండలం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. వచ్చే నెలలో జరిగే యువగర్జన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని దానికి స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకుల సహకారంతో యువగర్జన నిర్వహిస్తామని అందర్నీ కలుపుకొని ఎటువంటి భేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బోయిని కుమార్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టేకు అనిల్, యువజన సభ్యులు మంగరపు సాయి పటేల్, పారునంది సుమన్, నక్క దామోదర్, పాలెపు అజయ్, నగునూరి మధుబాబు, తోట ప్రశాంత్, నూకల చింటూ, మహంకాళి కృష్ణ, మెరుగు రాము, పత్తి అంజి, కూన చంద్రశేఖర్, కొంకటి రాజశేఖర్, బొజ్జ శ్రీకాంత్, కోలపురి ఆంజనేయులు,రామంచ సతీష్, సిరిగిరి తిరుపతి, అమ్మిగల్ల సుమన్, కాడే వంశీ, తాటికొండ తిరుపతి, బుర్ర అచ్యుత్ గౌడ్, బత్తిని శేఖర్, బత్తిని రాజశేఖర్, సిరిగిరి అంజి, మరియు యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :