గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మండల పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ ఏఈ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.
ఈ ఎన్నికల్లో గన్నేరువరం పంచాయతీ కార్యదర్శి జి. వెంకట్ రెడ్డిను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా గునుకుల కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి పి. రాజేష్ ఎన్నికయ్యారు.
అలాగే ఉపాధ్యక్షులుగా బి. రజిత, చీఫ్ అడ్వైజర్లుగా ఎం. రాకేష్, ఎండి. హనీఫుద్దీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె. ప్రణీత్, ఈ. రాజు, జాయింట్ సెక్రటరీలుగా వి. శ్రీనివాస్, జి. చిరంజీవి, కోశాధికారిగా ఎన్. శ్రీకాంత్ ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్. కవిత, టి. ఉపేందర్, ఏ. రాజశేఖర్ రెడ్డి, జి. అరుణ్ కుమార్, బి. కిరణ్ కుమార్లను ఎన్నుకున్నారు.
నూతన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అభినందించి, వారి నాయకత్వంలో ఉద్యోగుల సంక్షేమం, సేవా సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.








