contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కులం పేరుతో దూషణ .. ఇరువర్గాలపై కేసులు నమోదు ..

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కులం పేరుతో దూషించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయగా, అదే ఘటనకు సంబంధించి ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో పరస్పర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గన్నేరువరం గ్రామానికి చెందిన కుర్ర మనీషా భర్త హరీష్ కుటుంబ సభ్యులను అదే గ్రామానికి చెందిన బోయిని కుమార్, టేకు అనిల్ కులం పేరుతో దూషించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదును స్వీకరించిన గన్నేరువరం ఎస్ఐ నరేందర్ రెడ్డి ప్రాథమిక విచారణ అనంతరం బోయిని కుమార్, టేకు అనిల్‌పై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అదే సమయంలో, ఈ ఘటనకు సంబంధించి మరో వర్గం నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదులను నమోదు చేసి చట్టపరంగా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, విచారణలో తేలే అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :