పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ శేషాపురం సమీపంలో ఉన్న మామిడి తోటలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాలతో పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి మద్దినాయనపల్లి పంచాయతీ శేషాపురం సమీపంలో ఉన్న మామిడి తోటలో ఆడుతున్న పేకాట స్థావరం పై దాడి నిర్వహించగా పేకాట ఆడుతుండగా ఆరుగురు దేవిప్రసాద్, వెంకటేష్, లక్ష్మణ్ రెడ్డి, భరత్, దేవేంద్ర, మహేందర్ నాయుడు ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న పాకాల పోలీసులు. పేకాట ఆడుతున్న వారిని బైండోవర్ చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపిన పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు.
