మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. అందులో భాగంగానే ఈ ఉన్నతి పథకం ద్వారా కుప్పం బాదూరు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళ పి.వాణికి ఉన్నతి స్కీం ద్వారా 0 వడ్డీతో 3.50 లక్షల రూపాయలు గల నూతన ఆటోను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన ఆటోను స్వయంగా నడిపిన అనంతరం డ్వాక్రా మహిళ వాణికి ఆటోకు సంబంధించిన పత్రాలు, తాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల ఏపీఓ, గ్రామస్థులు పాల్గొన్నారు.
