contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈనెల 17 నుండి 23 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ఈనెల 17 నుండి 23 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

లేబర్ మొబిలైజేశన్ పెంచాలి

కూలీల వేజ్ రేట్ పెరగాలి

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో జిల్లా మొదటి స్థానంలో నిలవాలి …… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈనెల 17 నుండి 23 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శరత్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీన్ , స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, లేబర్ మొబిలైజేషన్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో జిల్లాను ప్రధమ స్థానంలో నిలపాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

గ్రామీణ ప్రాంతాల పారిశుధ్య స్థితిని అంచనా వేసే కీలకమైన పరిమానాత్మక, గుణాత్మక స్వచ్ఛ భారత్ మిషన్ పారామీటర్స్ పై పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

గ్రామాల్లో ఓ డి ఎఫ్ ప్లస్ మార్గదర్శకాలకు
అనుగుణంగా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, అందుకనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు అవార్డులు తీసుకురావాలన్నారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 17 నుండి 23 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టి, రోజువారిగా నిర్దేశించిన ఆయా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా అన్ని గ్రామాలలో , మే17న
పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి, గ్రామసభ నిర్వహించి మురుగు కాలువలు రోడ్లను శుభ్రం చేయాలన్నారు.

18న పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను ,రోడ్లపై చెత్తను తొలగించాలని, త్రాగునీటి పైపులైన్ల లీకేజీలను గుర్తించి అరికట్టాలన్నారు.

19 న వాటరింగ్ డే నిర్వహించాలని, అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.

20న గ్రామంలోని డంపింగ్ షెడ్ వైకుంఠధామం శుభ్రం చేయడంతో పాటు విద్యుత్ వాటర్ కనెక్షన్లు లేని వాటికి ఇవ్వాలని, కనెక్షన్లు ఉన్న వాటిలో ఏవేని రిపేర్లు ఉన్నట్లయితే చేయాలన్నారు.అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయాలని సూచించారు.

21న వినియోగంలో లేని పాత బావులను, పనికిరాని బోర్ వెల్స్ ను పూడ్చివేయాలని, నీటి నిలువ ఉండే ప్రాంతాలను, రోడ్లపై గుంతలను పూడ్చివేయాలని తెలిపారు.

22న తుప్పు పట్టిన, వంగిన విద్యుత్ స్తంభాలను మార్చాలని, వేలాడుతున్న లూజ్ వైర్లను సరిచేయాలని, వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం, బ్లీచింగ్ చేయడం జరగాలన్నారు.

23న డంప్ యార్డ్ శుభ్రం చేయడం, సెగ్రిగేషన్ చేయడం , తడి పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారీపై హౌస్ హోల్డ్స్ కు, గ్రామపంచాయతీ మెంబర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు, బాడీ ఫ్రీజర్లు వినియోగించడం పై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈనెల 19వ తేదీలోగా యాక్టివ్ లేబర్లో కనీసం 60 శాతం లేబర్ మొబిలైజేషన్ చేయాలని స్పష్టం చేశారు. చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కూలీలకు వేజ్ రేట్ పెరిగాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సీఈవో ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, డి ఆర్ డి ఏ అదనపు పీడీలు, మెప్మా పి డి గీత, డిప్యూటీ జడ్పీ సీఈఓ, మహిళా శిశు సంక్షేమ అధికారిని పద్మావతి, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీ ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :