తిరుపతి జిల్లా పాకాల మండలం కావలివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ఉపాధి కోసం ఓమన్కు వెళ్లి అక్కడ బందీగా మారిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లిన ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ, యజమానుల వేధింపులకు గురవుతూ స్వదేశానికి రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం కావలివారిపల్లి గ్రామానికి చెందిన పొలకల సుజాతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆమె ఓ ఏజెంట్ ద్వారా గృహ కార్మికురాలిగా పని చేసేందుకు ఓమన్ రాజధాని మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరిన కొద్దిరోజులకే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.
గత నాలుగు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని యజమానులకు పలుమార్లు తెలిపినా వారు పట్టించుకోలేదని వాపోయింది. అంతేకాకుండా గత రెండు నెలలుగా తనకు జీతం కూడా చెల్లించడం లేదని ఆరోపించింది. పని చేసే స్థితిలో లేనందున తిరిగి భారతదేశానికి పంపించాలని కోరినా, “నీ ఏజెంట్ నిన్ను మాకు అమ్మేశాడు.. నిన్ను పంపించం.. ఇక్కడే పని చేయాలి” అంటూ భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన దయనీయ పరిస్థితిని వివరిస్తూ సుజాత ఒక వీడియోను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జోక్యం చేసుకుని తనను రక్షించాలని వేడుకుంది. “ఎలాగైనా నన్ను స్వదేశానికి రప్పించి నా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చండి” అంటూ కన్నీటి పర్యంతమైంది.
ఈ ఘటనపై సుజాత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రవాసాంధ్రుల సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఓమన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల రక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Polakala Sujatha
W/o P Muniraju
Kavalivaripalli
Adhar Number: 8095 7035 6660
Passport: V4311640
Husband Mobile: 8106234870








