contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు

అనంతపురం జిల్లా, గుత్తి మండలం : అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా సోమవారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుత్తి పట్టణ మరియు మండల శాఖల ఆధ్వర్యంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమం భాగంగా బీజేపీ జెండాను పార్టీ శ్రేణులు ఎగురవేసి వేడుకలను ఉత్సాహంగా జరిపారు.

మండలంలోని వన్నెదొడ్డి, బసినేపల్లి, అనగానదొడ్డి గ్రామాలతో పాటు గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ, ఎన్టీఆర్ సర్కిల్, 17వ వార్డు తాడిపత్రి రోడ్డులో పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ దేశ సమైక్యత, సమగ్రత మరియు అభివృద్ధి లక్ష్యాలతో ఆవిర్భవించిందని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఏకైక పార్టీగా బీజేపీ నిలిచిందని తెలిపారు. భారతదేశ సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి చాటిన పార్టీగా గర్వంగా చెప్పవచ్చని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బీసీ వెంకప్ప, మండల అధ్యక్షులు పాలమూరు చంద్రశేఖర, పట్టణ ప్రధాన కార్యదర్శులు నూరుల్ హసన్ భాషా, చామంతుల ప్రేమ్ కుమార్, కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డీబీ రంగరాజు, జిల్లా కార్యదర్శి కవితా శర్మ, కార్యవర్గ సభ్యులు నాగేపల్లి లక్ష్మయ్య, విరోజి రావు, ఓబీసీ మోర్చా నాయకులు రామాంజనేయులు, రొయ్యల నారాయణ, మాణిక్యం, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రంగస్వామి రెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బావిగడ్డ ఓబులయ్య, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కందుల హేమలత, మైనార్టీ నాయకులు కరీం, హాజీ, తురకపల్లి పవన్, సీనియర్ నాయకులు పాలమూరు బాలయ్య, ఆకుల శ్రీనివాస్, అధినేని రామాంజనేయులు, యువ నాయకులు ఓం ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :