జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులు పట్టణంలో సంచలనంగా మారి విస్తృత చర్చకు దారి తీశాయి.
దాడుల సందర్భంగా కార్యాలయ ప్రధాన గేటుకు తాళాలు వేసిన ఏసీబీ అధికారులు, లోపల పలు విభాగాల్లోని ఫైళ్లను సవివరంగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. కీలక పత్రాలను పరిశీలిస్తూ అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించినట్లు తెలిసింది.
ఈ తనిఖీలు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, మరిన్ని వివరాల కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








