మెదక్ జిల్లా – తూప్రాన్ మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి గజ్వేల్ పార్టీ ఇంచార్జ్ నర్సారెడ్డి వ్యవహారాలపై ఫిర్యాదు చేశారు.
నర్సారెడ్డి అవినీతికి సంబంధించిన వార్తా కథనాలు పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నర్సారెడ్డిని తక్షణమే ఇంచార్జ్ పదవి నుంచి తొలగించి, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
ఈ విషయంపై మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.








