నిజామాబాద్ : ఈరోజు సాంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పూనం చంద్ర శంకర్ రావు చౌదరి అనే వ్యక్తి వద్ద 5.35 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1,33,750గా అధికారులు అంచనా వేశారు. విచారణలో నిందితుడు విశాఖపట్నం నుంచి నాందేడ్‌కు గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ మల్లేష్, సిబ్బంది, మోహన్‌సింగ్, గౌతమ్, దేవేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.








