contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయండి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మాల్టస్ స్మిత్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నెల్లూరు నగరంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు జరగనున్నట్లు తెలిపారు.

ఈ శిక్షణ తరగతుల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో పలు మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ తరగతుల్లో పాల్గొని విద్యార్థి సమస్యలపై చర్చించాలని సూచించారు.

అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టేందుకు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయ్, గోవర్ధన్, వంశి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :