కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా – కాగజ్‌నగర్: కార్మికులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సిర్పూర్ పేపర్ మిల్ కార్మిక జేఏసీ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి విజయవంతంగా 14వ రోజుకు చేరుకున్నాయి. యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించేంత వరకు వెనకడుగు వేసేది లేదని కార్మికులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నేటి దీక్షా శిబిరంలో కార్మికులు రాములు, వెంకటేష్, ఏకే సింగ్, రాజేష్ యాదవ్ కూర్చున్నారు. కార్మికులు వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.కార్మికులు చేస్తున్న ఈ పోరాటానికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుండి మద్దతు లభిస్తోంది. ఈరోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన BRS పార్టీ మహిళ నాయకురాలు కమల అసెంబ్లీ కో-కన్వీనర్, కాగజ్‌నగర్ మహిళా కన్వీనర్ వరలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం రెండు వారాలుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా యాజమాన్యం, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. కార్మికుల పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది తెలిపారు
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.








