- సమస్యలు పరిష్కారంకాక ప్రజల సతమతం
- సమస్యలు నీరుగార్చే విధానం
- క్రింది స్థాయి అధికారుల పై చర్యలేవి ?
- ప్రజా సమస్యలు నీరుగార్చే ప్రయత్నం .. పట్టించుకోని కలెక్టర్
ప్రకాశం జిల్లా : ‘కూటమి ప్రభుత్వం రాకముందు ప్రజా సమస్యల పై గళమెత్తారు, ఇప్పుడు ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని గొంతు చించుకుంటున్నారు. కానీ కొన్ని జిల్లాలలో కొందరు అధికారులు మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. ప్రజా సమస్యలు గాలికొదిలేస్తున్నారు. పేరుకే ప్రజా వేదిక, ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప పరిష్కారం చూపడం లేదని పేద ప్రజలు బోరున విలపిస్తున్నారు.
ఎవరికైనా సమస్య వచ్చిందంటే ముందుగా వారికి గుర్తుకొచ్చేది జిల్లా కలెక్టర్. కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు ఇస్తే వారి సమస్య పరిష్కారమవుతుందని ఒక గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే తో జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుండి పేద ప్రజలు చాలీ చాలని డబ్బుతో కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుంటారు. మండలం లోని అధికారులను కాదని కలెక్టర్ ఆఫీస్ కి మాత్రమే ఎందుకు వస్తున్నారు అనే విషయం జిల్లా కలెక్టర్ గమనించాలి.
వచ్చిన ఫిర్యాదులను ఎదో నామమాత్రంగా చూసి వెళ్ళిపోతారు కలెక్టర్, తరువాత పరిస్థితి ఏంటి ? ఎవరు ఆ సమస్యలు పరిష్కరించాలి ? ఫిర్యాదులు వస్తున్నాయి .. కానీ .. పరిష్కారమవుతున్నాయా లేదా అన్న విషయం కలెక్టర్ కి తెలియదు. కలెక్టర్ యొక్క అలసవత్వమే కిందిస్థాయి అధికారులకు బలంగా మారుతుంది. ఫిర్యాదులను తప్పుదోవ పట్టించడానికి మార్గాలు చూపినట్టు అయింది. ఆఖరికి ప్రజావేదికను కూడా బ్రష్టుపట్టిస్తున్నారు కొందరు లంచగొండి అధికారులు.
ప్రజా సమస్యలు ప్రజా వేదికలో కూడా నీరుగారుస్తున్నారనే సమాచారం తో రిపోర్టర్ టివి ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఒక ఫిర్యాదు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినపుడు, అది ఇమెయిల్ ద్వారా కానీ లేదా నేరుగా ఫిర్యాదు చేసినపుడు వాటిపై అధికారులు స్పందిస్తన్నారా లేదా అనే విషయం పై దృష్టిపెట్టినప్పడు అధికారులు స్పందించడం లేదని తేటతెల్లమైంది.
అందుకని రిపోర్టర్ టివి వాస్తవాలను తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేసింది. ముందుగా ఇమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదును జిల్లా కలెక్టర్ వారికీ, ఎస్పీ కి .. మా యొక్క ట్రేడ్ మార్క్ హక్కులను ఆర్టీవి వారు ఉల్లఘిస్తూ ప్రకాశం జిల్లాలో లోగో మైక్ తిప్పుతున్నారని, కలెక్షన్లు , దండాలు , మోసాలకు పాలుపడుతున్నారని దాని వలన ప్రజలకు తప్పుడు సెంకేతాలు వెళుతున్నాయని ఫిర్యాదు ఇవ్వడం జైరిగింది. ఈమెయిల్ కి సమాధానం రాకపోవడం తో నేరుగా స్థానిక రిపోర్టర్ ని ప్రజా వేదికలో ఫిర్యాదు చేయమని చెప్పడం జరిగింది. దీంతో కింది స్థాయి అధికారుల బాగోతం బయటపడింది.
డిపిఆర్వో దుర్గా ప్రసాద్ ని మాట్లాడుతున్నాని నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ద్వారా మాట్లాడిన అధికారి వాస్తవానికి ఫిర్యాదుకు సంబంధించిన వాస్తవాల పై వివరణ అడగాలి. పూర్తి సమాచారం సేకరించాలి దానిపై ఒక నివేదికను తయారు చేసి ఎన్ని శాఖలలకు పంపాలో .. పంపాలి .. కానీ ఆలా కాకుండా సదరు అధికారి ఇది మా ఫిర్యాదు కాదు పోలీస్ కి ఫిర్యాదు చేయండి అని తెలివిగా ఫిర్యాదుని నీరుగార్చారు. ఇదే విధంగా ఈ కింది స్థాయి అధికారులు జిల్లా ప్రజల సమస్యలను నీరుగారుస్తున్నారని తేటతెల్లమైంది. అందుకనే రిపోర్టర్ టివి ప్రత్యేకమయిన డ్రైవ్ ని ఏర్పాటు చేసింది. కిందిస్థాయి అధికారుల బాగోతం బయటపెట్టనుంది.
వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల నుండి చాలీ చాలని డబ్బుతో పేద ప్రజలు న్యాయం కోసం జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేసి వారి సమస్యని చెప్పుకోవాలని వస్తారు. మధ్యలోనే కలెక్టర్ వెళ్ళిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? చూసేవారు ఉండరు. చేసేవారు ఉండరు. ఒక పేదవాడు పదిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగగలడా ?
పక్క జిల్లా అయిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఒక చిన్న సమస్యని పరిష్కరించడానికి తానే స్వయంగా వెళ్ళి సమస్యని పరిష్కరించారు. అలాంటి ఎస్పీలు అలాంటి కలెక్టర్లు రాష్ట్రానికి అవసరం ఉంది.
ఇకనైనా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా తేరుకొని ప్రజా సమస్యల పై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవేళ స్పందించకపోతే ప్రజలమధ్యకి రిపోర్టర్ టీవీ వెళుతుందని తెలియజేస్తున్నాము.
Edlapadu Family Dispute Settled After Personal Visit by Palnadu SP