contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జియ్యమ్మవలస అడవుల్లో వింత పువ్వుల సందడి

జియ్యమ్మవలస : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం గోర్లివలస సమీప అటవీ ప్రాంతంలో అరుదైన కందజాతి పుష్పాలు దర్శనమివ్వడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. వింత ఆకారంలో వికసించిన ఈ పువ్వులను చూసేందుకు స్థానిక రైతులు, గిరిజనులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా వెలిసిన ఈ పుష్పాలు ప్రత్యేక ఆకృతితో ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుష్పాల గురించి సమాచారం తెలుసుకున్న కొంతమంది వృక్షశాస్త్ర నిపుణులు, శాస్త్రవేత్తలు ఇవి ప్రముఖ కందజాతి అయిన ‘ఎలిఫెంట్ ఫుట్ యామ్’ వర్గానికి చెందినవిగా భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి జాతులు అటవీ ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయని వారు పేర్కొన్నారు.

ఈ కందజాతికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పలు పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు తెలిపారు. మార్కెట్లో కూడా ఈ జాతి కందకు మంచి డిమాండ్ ఉందని వివరించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు ఈ పంట సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించి గిరిజన ప్రాంతాల్లో ఈ కందజాతి పంటను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేసేలా చర్యలు తీసుకుంటే, గిరిజన రైతులకు ఇది అదనపు ఆదాయ వనరుగా మారి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :