గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) పంపించిన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిజ్ఞను చదివి వినిపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్, మండల సీనియర్ నాయకుడు న్యాత సుధాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు చింతల రవి, మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి రవి, గన్నేరువరం సింగిల్ విండో డైరెక్టర్ బోయిని అంజయ్య, చాకలివానిపల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు బోయిని బాలయ్య, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కొట్టే భూమయ్య, మైలారం మాజీ సర్పంచ్ జక్కనపల్లి సత్తయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు బాలయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








