పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్ విఠల్ నగర్‌లో చెత్త సేకరణలో నెలకొన్న నిర్లక్ష్యంపై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు.
ఈ నెల 10వ తేదీన “చెత్త సేకరణలో నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు” అనే శీర్షికతో రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనంలో, అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ నివాసం సమీపంలోని గోడ పక్కన పెద్దఎత్తున చెత్త పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ పరిస్థితిని రిపోర్టర్ టీవీ కెమెరా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువచ్చింది.
కథనం ప్రసారమైన అనంతరం మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి,పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతో స్థానికులకు ఇబ్బందులు తొలగి, రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా చెత్త సేకరణ నిర్వహించి పరిశుభ్రతను కాపాడాలని వారు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.








